గ్రంథాలయంలో చదవడం మాకిష్టం

స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి

చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- లావేరు

స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని చేపట్టి పదేళ్ల పాటు భారత తొలి పౌరుడిగా మహోన్నత సేవలందించిన బాబు రాజేంద్రప్రసాద్‌ 1884 డిసెంబర్‌ 3న జన్మించారని అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం పుస్తక ప్రదర్శన నిర్వహించి చదవడం మాకిష్టం కార్యక్రమం జరిపించారు. కార్యక్రమంలో గ్రంధాలయ సహాయకులు గడ్డియ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

 

➡️