జగన్‌ పాలనలో బిసిలపై కేసులు

జగన్‌ పాలనలో బిసిలపై దాడులు చేస్తూ తిరిగి కేసులు పెడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గౌతు శిరీష

ప్రజాశక్తి- పలాస

జగన్‌ పాలనలో బిసిలపై దాడులు చేస్తూ తిరిగి కేసులు పెడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. మండలంలో కొత్తవూరు గ్రామంలో బుధవారం జయహో బిసిసభ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైసిపి నుంచి టిడిపిలో చేరిన వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో బిసిలకు న్యాయం చేశామని చెప్పుకుంటున్న జగన్‌ అన్ని ప్రాంతాల్లో రెడ్డిలకు పెద్దపీట వేస్తూ బిసి మంత్రులు, బిసి నాయకులతో పల్లకి మోయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 62 శాతం బిసిలు ఉంటే టిడిపి హయాంలో 34శాతం రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు కల్పించారన్నారు. బిసికి చెందిన 30 పథకాలకుపైగా వైసిపి ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బిసిలంతా టిడిపి వైపే వస్తున్నారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జయహో బిసి పరిశీలకులు బోర గోవిందరావు, కుత్తుం లక్ష్మణరావు, దువ్వాడ సంతోష్‌, పిరికట్ల విఠల్‌రావు, లోడగల కామేశ్వరరావు, గోళ్ళ చంద్రరావు, తమ్మినేని గంగారాం, సంతోష్‌ పండా, నెయ్యిల వసంతరావు, వంకల కూర్మారావు, గోవింద పాపారావు, షణ్ముఖరావు పాల్గొన్నారు.

 

➡️