టిడిపి కార్యాలయం ప్రారంభం

ఇచ్ఛాపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోటని, రానున్న ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవ్వరు అడ్డుకోలేరని ఎమ్మెల్యే అశోక్‌ బాబు స్పష్టం చేశారు. బుణవారం పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన టిడిపి పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అశోక్‌ బాబు ప్రారంభించి

టిడిపి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోటని, రానున్న ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవ్వరు అడ్డుకోలేరని ఎమ్మెల్యే అశోక్‌ బాబు స్పష్టం చేశారు. బుణవారం పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన టిడిపి పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అశోక్‌ బాబు ప్రారంభించి మాట్లాడుతూ నియోజకవర్గంలో వేసిన పంటలు ఎండిపోయాయని, కరువుతో విలయతాండవం చేస్తుంటే వైసిపి నేతలు నిమ్మకి నీరెత్తినట్లు ఊరుకోవడం శోచనీయమని విమర్శించారు. సాధికారిత యాత్రపై గొప్పలు చెప్పుకునే ఇన్‌ఛార్జికు కరువు మండలాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఏమి సాధించారని సాధికారిత యాత్ర చేస్తున్నారని అన్నారు. రెడ్డికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారని, కనీసం ఒక్కరికి ఒక్క రూపాయి రుణం ఇచ్చారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేనతో కలిసి ముందుకి వెళ్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కాళ్ల ధర్మారావు, సాలీనా ఢిల్లీ, నందిక జాని, ఆసీ లీలారాణి, కాళ్ల జయదేవ్‌, దక్కత ఢిల్లీరావు, సీపాన వెంకట రమణ, రెయ్య జానకీరావు, కొండ శంకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

➡️