టిడిపి విస్తృత ప్రచారం

సిఎం జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం

సరుబుజ్జిలి : ప్రజలతో మాట్లాడుతున్న రవికుమార్‌

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

సిఎం జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం అదోగతి పాలైందని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని షలంత్రి పంచాయతీ పరిధిలోని మర్రిపాడు, బురిడివలస, సవలాపురం గ్రామాల్లో శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే టిడిపిని ఆదరించి సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్‌ పేడాడ సూరపనాయుడు, పైడి మురళీ మోహన, టిడిపి మండల అధ్యక్షులు అంబళ్ల రాంబాబు, సూర్యం, పల్లి సురేష్‌, సిద్దార్ధ పాల్గొన్నారు.కవిటి: మండలం కొత్త కొజ్జిరియా, పాత కొజ్జీరియా, కరాపాడు గ్రామాల్లో బాబూ ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ భార్య నీలోత్పల గ్రామంలో ప్రతి ఇంటిని కలియతిరిగి టిడిపిి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు పథకాలు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.కోటబొమ్మాళి: మండలం పెద్ద బమ్మిడిలో టిడిపి మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, మాజీ ఎంపిపిలు తర్ర రామకృష్ణ, విజయలక్ష్మి పూజారి శైలజలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడుకు, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొండు లక్ష్మణరావు, నంబాళ శ్రీనివాస్‌, సాసుమంతు ఆనందరావు, బెండి అన్నపూర్ణ, బాడాన రమణమ్మ, రత్నాల కృష్ణకుమారి, కర్రి అప్పారావు పాల్గొన్నారు.పలాస : టిడిపి హయాంలోనే ఉద్దానం ప్రాంతం అభివృద్ధి చెందిందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. మండలంలోని రంగోయిలో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముద్రించిన పోస్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుత్తం లక్ష్మణరావు, దువ్వాడ సంతోష్‌, సోర్ర ఢిల్లేశ్వరరావు, తామాడ వాసుదేవు, కుత్తుం రామ్‌ప్రసాద్‌, దున్న దేవుడు పాల్గొన్నారు.

 

➡️