డిజిటల్‌ విద్యకు ప్రోత్సాహం

డిజిటల్‌ విద్యకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. రణస్థలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 141 మంది విద్యార్థులకు గురువారం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశానికే దిక్సూచిగా

రణస్థలం : ట్యాట్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌

రణస్థలం: డిజిటల్‌ విద్యకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. రణస్థలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 141 మంది విద్యార్థులకు గురువారం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశానికే దిక్సూచిగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానం అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి టొంపల సీతారాం, జె.ఆర్‌.పురం సర్పంచ్‌ భవిరి రమణ, మోడల్‌ స్కూల్‌ కమిటీ చైర్మన్‌ టేకి బ్రహ్మజి, ప్రధానోపాధ్యాయులు బి.రమణయ్య పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : పురుషోత్తపురం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజ్యాస్‌ ట్యాబ్‌లను చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1,2 వార్డు కౌన్సిలర్లు సుగ్గు ప్రేమ్‌కుమార్‌, చాట్ల పుష్ప, చాట్ల తిరుపతి, బచ్చు జగన్‌, నీలపు లక్ష్మి, ఎంఇఒ కె.అప్పారావు, ప్రధానోపాధ్యాయులు వై.లత పాల్గొన్నారు. కవిటి: విద్యారంగం అభివృద్ధికి సిఎం జగన్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్‌, నరేష్‌ కుమార్‌ అగర్వాల్‌ అన్నారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు గురువారం ట్యాట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి, ఆంగ్ల విద్య ట్యాబ్‌లు పంపిణీ ద్వారా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, నాయకులు ఎం.నరేంద్ర, దేవరాజ్‌ సాహూ, పూడి నీలాచలం, బర్ల నాగభూషణం, దువ్వు కృష్ణారెడ్డి, రమణమూర్తి, ఎంఇఒ ధనుంజయ మజ్జి పాల్గొన్నారు.కోటబొమ్మాళి: స్థానిక జిల్లా పరిషత్‌ బాలురు పాఠశాలలో చదువుతున్న 106 మంది విద్యార్థులకు ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, ఎంఇఒలు ఎస్‌.అప్పలరాజు, ఎల్‌.వి.ప్రతాప్‌లు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌, సర్పంచ్‌ కాళ్ల సంజీవరావు, పేడాడ వెంకటరావు, పాఠశాల హెచ్‌ఎం డబ్బీరు గోవిందరావు పాల్గొన్నారు.

 

➡️