తాగునీటి సమస్యపై కౌన్సిలర్ల ఆగ్రహం

మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా

అధికారులను నిలదీస్తున్న కౌన్సిలర్‌ సూర్యనారాయణ

ప్రజాశక్తి- పలాస

మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, 15 రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తున్నారని, ప్రతి సమావేశంలో నీటి ఎద్దడిపై చర్చలే చేస్తున్నారే తప్ప తాగునీరు సరఫరా చేయలేక పోతున్నారని కౌన్సిలర్లు గురిటి సూర్యనారాయణ, జోగ త్రివేణి మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ, త్రివేణి మాట్లాడుతూ మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిసినా నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. వార్డుల్లో బోర్లు పాడైన బాగు చేయడం లేదని, పవర్‌ బోర్లు మరమ్మతులకు గురయ్యాయని చెప్పిన పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్‌ బల్ల గిరిబాబు, కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ స్పందిస్తూ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు నాలుగు ట్యాంకులతో నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆదివారం నుంచి అదనంగా మరో నాలుగు ట్యాంకులతో నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పాడైన బోర్లు, పవర్‌ బోర్లుకు మరమ్మతులు చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌన్సిలర్‌ బెల్లాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బస్టాండ్‌ సమీపంలో కాలువపై టీ దుకాణాలు పెట్టడంతో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారని, దీంతో ప్రయాణికులు, బస్సులు, వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఇదే సమస్యపై చెప్పిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అనంతరం ఎజెండాలో ఉన్న అంశాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో వైఎస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌ బాబు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై కౌన్సిలర్ల ఆగ్రహంప్రజాశక్తి- పలాసమున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, 15 రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తున్నారని, ప్రతి సమావేశంలో నీటి ఎద్దడిపై చర్చలే చేస్తున్నారే తప్ప తాగునీరు సరఫరా చేయలేక పోతున్నారని కౌన్సిలర్లు గురిటి సూర్యనారాయణ, జోగ త్రివేణి మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ, త్రివేణి మాట్లాడుతూ మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిసినా నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. వార్డుల్లో బోర్లు పాడైన బాగు చేయడం లేదని, పవర్‌ బోర్లు మరమ్మతులకు గురయ్యాయని చెప్పిన పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్‌ బల్ల గిరిబాబు, కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ స్పందిస్తూ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు నాలుగు ట్యాంకులతో నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆదివారం నుంచి అదనంగా మరో నాలుగు ట్యాంకులతో నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పాడైన బోర్లు, పవర్‌ బోర్లుకు మరమ్మతులు చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌన్సిలర్‌ బెల్లాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బస్టాండ్‌ సమీపంలో కాలువపై టీ దుకాణాలు పెట్టడంతో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారని, దీంతో ప్రయాణికులు, బస్సులు, వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఇదే సమస్యపై చెప్పిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అనంతరం ఎజెండాలో ఉన్న అంశాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో వైఎస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌ బాబు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

 

 

➡️