‘తెరవే’ సాహితీ సమ్మేళనం

Mar 3,2024 23:39
నగరంలోని స్థానిక శాంతినికేతన్‌ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యాన ఆదివారం నెలవారీ సాహితీ

తెరవే సమ్మేళనంలో పాల్గొన్న కవులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని స్థానిక శాంతినికేతన్‌ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యాన ఆదివారం నెలవారీ సాహితీ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెరవే అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ కోమలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవితపై ఆసక్తి పొంపొందించడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కవులు గుడిమెట్ల గోపాలకృష్ణ, పి.వి.దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ నిక్కు అప్పన్న, నాగేశ్వరరావు, ఐ.యన్‌.డి.ప్రసాద్‌, ఇద్ది పాపయ్య బి.జగన్నాథం తమ కవితలను చదివి వినిపించారు.

 

➡️