తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసే దిశగా పెద్దఎత్తున అంతర్జాతీయ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న ఆంధ్రా సారస్వతా పరిషత్‌ సంకల్పం నెరవేరాలని, ఈ మహాసభలను విజయ వంతం చేయాలని అంబేద్కర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు అన్నారు. ఆంధ్ర

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విసి వెంకటరావు, తదితరులు

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసే దిశగా పెద్దఎత్తున అంతర్జాతీయ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న ఆంధ్రా సారస్వతా పరిషత్‌ సంకల్పం నెరవేరాలని, ఈ మహాసభలను విజయ వంతం చేయాలని అంబేద్కర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు అన్నారు. ఆంధ్ర సారస్వతా పరిషత్‌, చైతన్య విద్యాసంస్థల సంయుక్తంగా జనవరి 5, 6, 7 తేదీల్లో రాజ మండ్రిలో నిర్వహిస్తున్న తెలుగు మహాసభల పోస్ట ర్‌ను ఆవిష్కరించారు. ఆంధ్రా సారస్వతా పరిషత్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లఖినాన రవికుమార్‌ వైస్‌ ఛాన్సలర్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ మహా సభలకు తెలుగు ప్రముఖులు, గవర్నర్లు, సినీ ప్రముఖులు, పీఠాధిపతులు, రాజకీయ నాయకుల, విద్యావేత్తలు, యాభై దేశాల నుంచి అతిథులు హాజరు కానున్నారని, తెలుగుభాషలో సాహితీ ప్రక్రి యలపై మూడు రోజులు పాటు సదస్సులు జరుగు తాయని తెలిపారు. ఈ ఆవిష్కరణలో తెలుగు విభాగం ఆచార్యులు డాక్టర్‌ కళ్ళేపల్లి ఉదరు కిరణ్‌, స్పోర్ట్స్‌ డీన్‌ డాక్టర్‌ రమణమూర్తి పాల్గొన్నారు.

 

➡️