త్వరితగతిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పట్టాల

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి తహశీల్దార్లు, ఎంపిడిఒలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందుల్లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏ సచివాలయంలోనూ సున్నా రిజిస్ట్రేషన్‌ ఉండరాదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా రిజిస్ట్రార్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.కుల గణన పూర్తి కావాలికుల గణన సర్వే జిల్లాలో 85 శాతం పూర్తయిందని, మిగిలిన 15 శాతం త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి తహశీల్దార్‌, ఎంపిడిఒ తమ పరిధిలో కనీసం 200 కుటుంబాల సమాచారాన్ని స్వయంగా పరిశీలించి క్రాస్‌ చెక్‌ చేసుకుని నివేదించాలన్నారు. జిల్లాలో 1.72 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇంకా పంపిణీ చేయాల్సింది ఉందన్నారు. ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్‌ కార్డుల పంపిణీ కూడా వీటితో పాటు రానున్న మూడు రోజుల్లో శతశాతం పూర్తి చేయాలన్నారు. అందరి ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని సూచించారు. 2022-23 సంవత్సరానికి గానూ విడుదలైన 15వ ఆర్థిక సంఘ నిధులకు ఈ-గ్రామ్‌ స్వరాజ్‌ వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయిలో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలన్నారు.ఎన్నికల సిబ్బంది డేటా అప్‌లోడ్‌ చేయాలిఎన్నికల విధుల్లో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బంది వివరాలను ఎన్నికల పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. పోలింగ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో జిల్లా, మండలం, గ్రామం, హోదా తదితర వివరాలను అప్‌లోడ్‌ చేసి రెండు రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు, వైద్యారోగ్య, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డేటా శత శాతం నమోదు కావాలని స్పష్టం చేశారు. ఇందుకు రెండు రోజుల గడువు మాత్రమే ఉందని చెప్పారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సిపిఒ ప్రసన్నలక్ష్మి, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామ్‌, డిపిఒ రవికుమార్‌, డిఆర్‌డిఎ, ఐసిడిఎస్‌, డ్వామా పీడీలు విద్యాసాగర్‌, శాంతిశ్రీ, చిట్టిరాజు, జిల్లా రిజిస్ట్రార్‌ కె.మన్మథరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️