దర్శించుకుంటున్న అచ్చెన్నాయుడు

మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా

దర్శించుకుంటున్న అచ్చెన్నాయుడు

టెక్కలి రూరల్‌ :

మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా యాత్రికులతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా యాత్రికులు వేకువజాము నుంచే దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేయకపోవడంతో పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్‌ సర్లాన సుధాకర్‌, సర్పంచ్‌ సర్లాన బాలకృష్ణ పాల్గొన్నారు. అలాగే టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించారు. వీరికి ఆలయ ఇఒ వాకచర్ల రాధాకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సుధాకర్‌ ఆలయ మర్యాదల తో స్వాగతం పలికారు. ఈయనతో పాటు డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌ ఉన్నారు.

 

➡️