దళిత ద్రోహి జగన్‌

దళితుల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని, ఆయన నేడు అంబేద్కర్‌ జపం చేయడం విడ్డూరంగా

టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌

ప్రజాశక్తి – ఆమదాలవలస

దళితుల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని, ఆయన నేడు అంబేద్కర్‌ జపం చేయడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ పాలనలో దళితుల మారణకాండ నేటికీ కొనసాగుతోందన్నారు. దళిత, గిరిజన ఓట్లతో గద్దెనెక్కిన వైసిపి… ఎస్‌సి కార్పొరేషన్‌ నిధులను దారిమళ్లించి వారికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కోడి కత్తి శ్రీనును ఎన్నికలకు ముందు పావుగా వాడుకుని ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నా కనీసం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. మాస్కులు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను అతి కిరాతకంగా నడిరోడ్డుపై హింసించిన సంఘటనను రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదన్నారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలు వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండడంతో కొత్త నాటకానికి జగన్మోహన్‌ రెడ్డి తెరతీశారని విమర్శించారు. జగన్‌ ఎత్తుగడలను దళితులు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు అన్నెపు భాస్కరరావు, బి.వి రమణమూర్తి, ధవళ అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️