ధాన్యం కొనుగోలుపై సమీక్ష

రైతులు నుంచి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు ప్రారంభించాలని తహశీల్దార్‌ ఎస్‌.రమణారావు మిల్లర్ల యజమానులకు ఆదేశించారు. శనివారం మండలంలో డొంకలపర్త గ్రామంలో స్వామి అయ్యప్ప రైస్‌మిల్లును పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎటువంటి అభ్యంతరాలు చూపించకుండా కొనుగోలు చేయాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. అలాగే రైతులకు సకాలంలో బిల్లును చెల్లించాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రామారావు, విఆర్‌ఒల జిల్లా అధ్యక్షులు రమేష్‌ బాబు పాల్గొన్నారుపలాస: గ్రామాల్లో రైతులకు

పలాస : సమావేశంలో మాట్లాడుతున్న పోలారావు

ప్రజాశక్తి- బూర్జ

రైతులు నుంచి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు ప్రారంభించాలని తహశీల్దార్‌ ఎస్‌.రమణారావు మిల్లర్ల యజమానులకు ఆదేశించారు. శనివారం మండలంలో డొంకలపర్త గ్రామంలో స్వామి అయ్యప్ప రైస్‌మిల్లును పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎటువంటి అభ్యంతరాలు చూపించకుండా కొనుగోలు చేయాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. అలాగే రైతులకు సకాలంలో బిల్లును చెల్లించాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రామారావు, విఆర్‌ఒల జిల్లా అధ్యక్షులు రమేష్‌ బాబు పాల్గొన్నారుపలాస: గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి వారి నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ ఎఒ పోలారావు రైతుభరోసా కేంద్రాల సిబ్బందికి సూచించారు. పలాస వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం వ్యవసాయశాఖ అసిస్టెంట్లు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందితో ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. ధాన్యం తేమ, ధాన్యాన్ని మిల్లర్లుకు తరలించేందుకు ట్రాక్టర్‌ ట్యాగ్‌ చేసి కొనుగోలు చేసిన ఆరు గంటల సమయంలో మిల్లర్లుకు ధాన్యాన్ని చేరవేయాలన్నారు.

 

➡️