నమ్మకద్రోహానికి జగన్‌ నిదర్శనం

నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కాకుండా ప్రజలను మభ్యపెట్టి ఆడిన ప్రతి మాట అబద్ధమని ఈ ఐదేళ్లలో నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. మండలంలోని

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

ప్రజాశక్తి – కవిటి

నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కాకుండా ప్రజలను మభ్యపెట్టి ఆడిన ప్రతి మాట అబద్ధమని ఈ ఐదేళ్లలో నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. మండలంలోని రామయ్యపుట్టుగలో తన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌ రద్దు చేస్తానని హామీనిచ్చి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. రైతులకు ఏడాదికి రూ.13,500 రైతుభరోసా అందిస్తానని చెప్పి కేవలం రూ.7,500తో చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం చేస్తానని, విద్యుత్‌ బిల్లులు తగ్గిస్తానని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తానని ఇచ్చిన హామీల మాటేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఏటా జాబ్‌ కేలండరు ప్రకటిస్తానని చెప్పి, జాబు లేకుండా చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్రం యావత్తు ఎదురుచూస్తోందన్నారు.

 

➡️