నేర నియంత్రణకు పటిష్ట చర్యలు

దర్యాఫ్తు అధికారులు మారుతున్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలనా

మాట్లాడుతున్న జిల్లా జడ్జి, ఎస్‌పి

జిల్లా జడ్జి, ఎస్‌పి

ప్రజాశక్తి- శ్రీకాకుళం

దర్యాఫ్తు అధికారులు మారుతున్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలనా పేర్కొన్నారు. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పోలీసు అధికారులను ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఆదేశించారు. ఎస్‌పి అధ్యక్షతన జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పోలీసు అధికారులతో శనివారం ద్వితీయ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశంలో జడ్జి పాల్గొన్నారు. కేసులు దర్యాప్తుపై పలు ముఖ్యమైన అంశాలపై దిశ నిర్దేశాలు చేశారు. కేసులు దర్యాప్తు, దర్యాప్తులో ఎదురయ్యే లీగల్‌ సమస్యలు నేర ప్రవృత్తి, నేర తరహా వంటి పలు అంశాలపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లతో ఎస్‌పి చర్చించారు. జడ్జి మాట్లాడుతూ చట్టాలపై అవగాహనపై నిపుణులతో ఆన్‌లైన్‌ సెమినార్‌ ద్వారా కొత్త అమండ్మెట్స్‌, చట్టాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పెండిగ్‌ కేసులకు వీలైనంత మేరకు సిసి నెంబర్ల మంజూరు చేస్తామని తెలిపారు. కేసు నమోదు, ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌, ప్రాపర్టీ సీజ్‌, ముద్దాయిలు అరెస్టు, ఛార్జ్‌షీట్‌ దాఖలు అంశాలపై ఎదురయ్యే లీగల్‌ సమస్యలపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా మా దృష్టికు తీసుకువస్తే పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్‌పి మాట్లాడుతూ గతేడాదిలో నేరాలు నివారణకు తీసుకున్న పటిష్టమైన చర్యలతో నేరాలు తగ్గుమఖం పట్టాయని తెలిపారు. నాన్‌ బెయిబుల్‌ వారట్లు వీలైనంత మేరకు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

➡️