పలు అభివృద్ధి పనులు ప్రారంభం

వైసిపి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి

పలాస : శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

వైసిపి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలం బొడ్డపాడులో ఎస్‌టి కమ్యూనిటీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ సెంటర్లు నిర్మాణంతో పాటు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణం చేశామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.700 కోట్లుతో మంచినీటి పథకాన్ని ప్రారంభించి ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తామడ మధన్‌, ఎంపిటిసి మద్దిల పాపారావు, ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి, మాజీ సర్పంచ్‌ బొడ్డు సుధాకర్‌, వైసిపి నాయకులు పాల్గొన్నారు.పాతపట్నం: మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణం చేపట్టిన పాతపట్నం-1లో నూతన గ్రామ సచివాలయం, మండల పరిధిలో కొరసవాడలో నిర్మాణం చేపట్టిన రైతుబంధు కేంద్రం, సచివాలయ భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. కార్యక్రమంలో కొరసవాడ సర్పంచ్‌ జక్కర ఉమామహేశ్వరి, కొండాల అర్జునరావు, ఎంపిపి దొర సావిత్రమ్మ, వైస్‌ ఎంపిపి ప్రదీప్‌, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.రణస్థలం రూరల్‌: సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు. మండలం బంటుపల్లిలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులు రూ.25లక్షలతో సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, జెడ్‌పిటిసి టొంపల సీతారాం, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి చిల్ల వెంకటరెడ్డి, ఎంపిటిసిల సంఘం అధ్యక్షులు మహంతి చిన్న రామునాయుడు, నాయకులు పాశపు ముకుంథరావు, నారాయణరావు పాల్గొన్నారు.కవిటి: సచివాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలం నెలవంకలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్లను మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు బొరివంకలో సచివాలయం, నూతనంగా నిర్మించిన బస్‌ షెల్టర్‌, బెంతు ఒరియాల సామాజిక భవనాలను నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఎబి చైర్మన్‌ దువ్వు కృష్ణారెడ్డి, సర్పంచ్‌ గౌతమి రెడ్డి, ఎఎంసి చైర్మన్‌ బాబురావు, వైస్‌ చైర్మన్‌ వె.ౖనీలయ్య, కో-ఆప్షన్‌ మెంబర్‌ పాండవ చంద్రశేఖర్‌, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️