పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు మంచిది కాదు

టిడిపి ఆవిర్భావం నుంచి

అప్పలసూర్యనారాయణ

  • మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

టిడిపి ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తలు పనిచేస్తున్నారని, వారిని విస్మరించి అసమ్మతి వాదులను అక్కున చేర్చుకుని పార్టీకి నష్టం చేకూర్చే చర్యలను ప్రోత్సహించడం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడికి తగదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ధ్వజమెత్తారు. అరసవల్లిలోని ఆయన నివాసం వద్ద శనివారం విలేకరులతో మాట్లాడారు. వ్యక్తులపై చూపించే శ్రద్ధ పార్టీ ప్రయోజనాలపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్షుని పదవిని కట్టబెట్టినప్పుడు జిల్లా నాయకత్వం ఎంతగానో ఆనందపడిందని, కానీ, ఆ ఆనందాన్ని మిగల్చకుండా అధ్యత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అసమ్మతిని ప్రోత్సహించారని విమర్శించారు. జిల్లాలో పార్టీకి నష్టం చేకూరుస్తారని భావిస్తే రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించినప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసేవారని అన్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు వ్యక్తిగత ప్రయోజనాలు కన్నా పార్టీ ప్రయోజనాలు కాపాడే వారై ఉండాలన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు.

➡️