పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటు

పాలకుల నిర్లక్ష్యం వలన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలగ సామాజిక తరగతి వెనుక పడిందని పల్లంట్ల వెంకట రామారావు

నినదిస్తున్న తెలగ సామాజిక తరగతి నేతలు

ఇచ్ఛాపురం:

పాలకుల నిర్లక్ష్యం వలన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలగ సామాజిక తరగతి వెనుక పడిందని పల్లంట్ల వెంకట రామారావు అన్నారు. తెలగజాతికి జరుగుతున్న అన్యాయంపై మహా పాదయాత్రకు ఇచ్ఛాపురం నుంచి పాయకరావుపేట వరకు చేపట్టేందుకు రామారావు ఆదివారం శ్రీకారం చుట్టారు. ముందుగా స్థానిక గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న తెలగజాతికి జరుగుతున్న అన్యాయంపై పాలకులు కళ్లుతెరిపించే ప్రయత్నంలో భాగంగా ఈ మహా పాదయాత్ర చేస్తున్నా మన్నారు. ఉత్తరాంధ్రలో పది లక్షల మంది ఉన్న తెలగలను బిసిలో చేర్చకపోవడంతో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. 1962 వరకు బిసి రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్నా ఆ తరువాత తొలగించార న్నారు. తమ జాతి వెనుకబడిన తీరును పుట్టు స్వామి, మంజునాథ కమిషన్‌ ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకో లేదన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేపడుతున్న ఆత్మ గౌరవ యాత్ర విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలగ కుల నేతలు రొక్కం సూర్యప్రకాశరావు, పెద్ది లక్ష్మి నారాయణ, పెద్ది రమణారావు, త్రిపురాన రాజేంద్ర దాస్‌, శ్రీనివాసరావు, గాలిబంద్‌, పల్లంటి మధుమూర్తి, సూర్యప్రకాశరావు, శ్రీను, కుమార్‌ పాల్గొన్నారు.

 

➡️