పింఛన్లు పంపిణీ చేయాలి

జిల్లాలో సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను తక్షణమే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఇవ్వాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు

శ్రీకాకుళం అర్బన్‌ : కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌:

జిల్లాలో సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను తక్షణమే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఇవ్వాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె.బాబు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ను ఛాంబర్‌లో కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సామాజిక పింఛను చెల్లింపులో జాప్యం తగదన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో భాగంగా వాలంటీర్లను వినియోగించవద్దని ఎన్నికల కమిషన్‌ షరతు విధించిందన్న కారణం చూపుతూ పింఛన్లు చెల్లించకపోవడం అన్యామన్నారు. సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేపట్టాలని కోరారు. జనవరి 23న బటన్‌ నొక్కిన ఆసరా, ఫిబ్రవరి 16న బటన్‌ నొక్కిన చేయూత, ఫిబ్రవరి 29న బటన్‌ నొక్కిన విద్యాదీవెన, మార్చి 14న బటన్‌ నొక్కిన ఇబిసి నేస్తం పథకాల మొత్తం రూ.13 వేల కోట్లు ప్రభుత్వ అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన దోపిడీిని కప్పిపుచ్చుకోవడానికి టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు బొణిగి భాస్కరరావు, లక్ష్మణరావులు ఉన్నారు.బూర్జ: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్‌ను ఎన్నికలు కోడ్‌ అమల్లో ఉండడం వలన వాలంటీర్లు పంపిణీ చేయకూడదని ఎలక్షన్‌ కమిషనర్‌ ఆదేశాలు ఉండడంతో నేరుగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛను అందజేయాలని టిడిపి మండల అధ్యక్షులు వావిలపల్లి సీతారాం బాబు ఆధ్యర్యంలో ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ రవీంద్రబాబుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బూర్జ ఎంపిటిసి పోలినాయుడు, తెలుగు యువత అధ్యక్షులు జగన్నాథనాయుడు, గోపి, వారాడ రాంబాబు, స్వామినాయుడు, గిరి, ఆదినారాయణ, వెంకునాయుడు, సూరిబాబు పాల్గొన్నారు.సోంపేట: పింఛనుదారులకు ఇళ్ల వద్దకే పింఛన్‌ సొమ్ము అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బి.అశోక్‌ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సూరాడ చంద్రమోహన్‌, మద్దిల నాగేశ్వరరావు, శేఖర్‌, శ్రీను, మధు, మడ్డు రవి, ఆనంద్‌ పాల్గొన్నారు.పొందూరు: సచివాలయం సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ఎంపిడిఒ సిహెచ్‌ సూర్యనారాయణకు టిడిపి మండల అధ్యక్షుడు చిగులపల్లి రామ్మోహన్‌ రావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్‌ అధ్యక్షులు కూన వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు అనకాపల్లి చిన్నరంగ, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బలగ శంకర్‌ భాస్కరరావు, పోలినాయుడు, బొడ్డేపల్లి సత్యం, అప్పలనాయుడు పాల్గొన్నారు.నందిగాం: పింఛను ఇంటి వద్దనే అందించాలని టిడిపి మండల నాయకుల ఆధ్వర్యంలో ఎంపిడిఒ జి.శివప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మల్ల బాలకృష,్ణ పోలాకి చంద్రశేఖరరావు, కవిటి ధర్మారావు, వెండిగిరి, సింహాచలం, లోకనాథం, నరసింహులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు నూక రాజు ఎంపిడిఒ ఎస్‌. వాసుదేవరావును కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో రాజు ఆధ్వర్యంలో సర్పంచ్‌లు ఎంపిడిఒకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు బొడ్డేపల్లి గౌరీపతిరావు, తమ్మినేని చంద్రశేఖర్‌, ఎంపిటిసి అన్నెపు భాస్కరరావు, గొండు రమణ, చేపేన సత్తిరాజు, నేటింతి జ్యోతి, బోడేపల్లి మల్లేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే మున్సిపాలిటీలో పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ మున్సిపల్‌ కమిషనర్‌ జి.రవికి టిడిపి పట్టణ అధ్యక్షుడు సంపదరావు మురళి అధ్యక్షతన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మొదలవలస రమేష్‌, బోర గోవిందరావు, తంగి గురయ్య, షేక్‌ మాలిక్‌ ఉన్నారు.పలాస: ఇంటి వద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, ఎంపిడిఒ మెట్ట వైకుంఠరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పి.విఠలరావు, బడ్డ నాగరాజు, కుత్తుం లక్ష్మణకుమార్‌, సప్ప నవీన్‌ పాల్గొన్నారు.శ్రీకాకుళం రూరల్‌ : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో పిం;న్‌ సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని కోరుతూ బీజీపీ, టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి కోరాడ సర్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ పాండ్రంకి శంకర్‌, టిడిపి జిల్లా కోశాధికారి తిరుమల, నాగేంద్ర యాదవ్‌ పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు: పింఛనుదారుల ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయాలని టిడిపి నాయకులు కోరుతూ ఎంపిడిఒ తిరుమలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, ఉపాధ్యక్షులు అరసవెల్లి ఉమామహేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి పోతనపల్లి సాంబమూర్తి, యూనిట్‌ ఇన్‌ఛార్జి అంబటి రామకృష్ణ పాల్గొన్నారు. పోలాకి : ఎంపిడిఒకు వినతిపత్రం అందజేసిన వారిలో టిడిపి మండల అధ్యక్షులు ఎం.వెంకట అప్పలనాయుడు, డోల ప్రసాదరావు, ఎన్‌.వెంకునాయుడు, ఎస్‌.నారాయణ దాసు, అప్పలరెడ్డి, రాంబాబు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : ఇంటివద్దే పింఛను పంపిణీ చేయాలని డిడిపి నాయకులు ఎంపిడిఒ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు దక్కత ఢిల్లీరావు, దక్కత శ్రీను, లోపింటి పద్మనాభం, అదేవిధంగా మున్సిపల్‌ కమిషనర్‌కు టిడిపి నేతలు. కాళ్ల ధర్మారావు, నందిక జాని, కాళ్ల జయదేవ్‌, కాళ్ల దిలీప్‌కుమార్‌. లీలారాణి, కోటి, శ్రీనివాస్‌ సాహు, జానకిరావు కూడా వినతిపత్రం అందజేశారు.

 

➡️