పోరాటాలతోనే మహిళా హక్కులు సాకారం

మహిళా హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయడమే

మాట్లాడుతున్న అమ్మన్నాయుడు

సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు

ప్రజాశక్తి- రణస్థలం

మహిళా హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిని కొనసాగించడమని సిఐటియు జిల్లా అధ్యక్షులు చింతాడ అమ్మన్నాయుడు అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యాన రణస్థలం హైస్కూల్‌ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1917 మార్చి 8న లక్షలాది మంది మహిళా కార్మికులు హక్కుల కోసం, మహిళలకు ఓటు హక్కు కోసం ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. దీంతో మార్చి 8న మహిళా దినోత్సవ తేదీగా నిర్ణయించారని అన్నారు. ఈ దినోత్సవం మహిళల కోర్కెల దినంగా చరిత్రపుటల్లో నిలిచిందన్నారు. స్కీమ్‌ కార్మికులకు పనికి తగిన పరిహారాన్ని చెల్లించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విఫమయ్యాయని అన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజన పథకం తదితర స్కీమ్‌ కార్మికుల శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేర్చి వారికి అవసరమైన సేవలు అందించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళలపై శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ నానాటికి తీవ్రతరం అమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షు లు కె.సుజాత, నాయుకులు ఆర్‌.అప్పమ్మ, బి.స్వాతి, బి.అసిరితల్లి. బి.సుజాత పాల్గొన్నారు.

 

➡️