ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు

Mar 5,2024 21:06

ప్రజాశక్తి-ఇచ్ఛాపురం : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. మంగళవారం మండలంలో మండపల్లి, బాలకృష్ణాపురం పంచాయతీల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. మండపల్లి పంచాయతీలో రూ.8 లక్షలు జిల్లా పరిషత్‌ నిధులతో డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండపల్లి పంచాయతీ బుడ్డేపుపేట గ్రామంలో రూ.5 లక్షలు జిల్లా పరిషత్‌ నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలకృష్ణపురం గ్రామంలో మహిళా సంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మళ్లీ పొందాలంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, మండపల్లి సర్పంచ్‌ పిట్ట శేషమ్మ మామయ్య, కారంగి మోహన్‌రావు, సల్ల దేవరాజ్‌, దక్కత నోకయ్య రెడ్డి, ఉప్పాడ రాజారెడ్డి, బుడ్డ కళ్యాణ్‌, సాలిన ఢిల్లీరావు, మోహన్‌ దాస్‌ పాల్గొన్నారు.

➡️