మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి

ఎన్నికలను పర్యవేక్షించాల్సిన రెవెన్యూశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజ్యాంగ విరుద్ధంగా

మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి

వాలంటీర్లకు జగన్‌ ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు

ఎన్నికల్లో వైసిపి కార్యకర్తల పని అప్పగించడం తగదు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ధ్వజం

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికలను పర్యవేక్షించాల్సిన రెవెన్యూశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజ్యాంగ విరుద్ధంగా బరితెగించి మాట్లాడుతన్నారని, వాలంటీర్లకు ఎన్నికల్లో వైసిపి ఏజెంట్లుగా, కార్యకర్తలుగా ప్రచారం చేయాలని చెప్పడం ఎన్నికల ఉల్లంఘనే అవుతుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌తో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వాలంటీర్లకు ఇస్తున్న జీతాలు ధర్మాన, జగన్‌ ఇంట్లో సొత్తు కాదని అన్నారు. ప్రజాధనాన్ని ఐదేళ్ల పాటు జీతాలుగా చెల్లించారన్నారు. ప్రభుత్వ సొమ్మును జీతాలుగా తీసుకున్న వారిని ఎన్నికల ప్రచారం కోసం ఎలా వాడుతారని ప్రశ్నించారు. ప్రజల డబ్బును దళారులకు, బ్రోకర్లుకు, వాలంటీర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. నోటిఫికేషన్‌ వచ్చాక వాలంటీర్లు వైసిపి ప్రచారంలో పాల్గొంటే టిడిపి, జనసేన కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైసిపికి ఓటు వేయకపోతే పింఛను ఇవ్వరని వృద్ధులను ఇప్పటి నుంచే వాలంటీర్లు బెదిరిస్తున్నారని విమర్శించారు. సాక్ష్యాధారాలతో ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం చేయడంపై ధర్మాన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధర్మానకు అంత సరదా ఉంటే వైసిపి నేతల జేబుల నుంచి వాలంటీర్లకు జీతాలు ఇచ్చుకోవాలన్నారు. వైసిపి దౌర్జన్యాలను ఎండగట్టడమే టిడిపి రా కదలి రా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో దూరంగా ఉంచాలని చెప్పిందని గుర్తు చేశారు. రవికుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 26న శ్రీకాకుళంలో రా కదలిరా సభ చంద్రబాబు ఆధ్వర్యాన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభలో లక్షమంది ప్రజలు హాజరవుతున్నట్టు తెలిపారు. సమావేశంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెలేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కొండ్రు మురళీమోహన్‌, కలమట వెంకటరమణ పాల్గొన్నారు.

 

➡️