మే 27 నుంచి విద్య, వైజ్ఞానిక శిక్షణా తరగతులు

మే 27 నుంచి టెక్కలి ప్రణవి డిగ్రీ కాలేజ్‌లో

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మే 27 నుంచి టెక్కలి ప్రణవి డిగ్రీ కాలేజ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.చందు, డి.హరీష్‌లు తెలిపారు. ఈ మేరకు నగరంలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో సోమవారం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగంలో ఉండే సమస్యలపైన, విద్యార్థుల హక్కుల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్‌ నాటి నుంచి నేటి వరకూ అలుపెరిగిన పోరాటం చేస్తుందని అన్నారు. దేశంలో మతోన్మాద శక్తులను తరిమికొట్టి దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగేది కేవలం విద్యార్థులు మాత్రమే అని అన్నారు. ఇటీవల కాలంలో జెఎన్‌యు యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ విజయ దుందుభి మోగించి బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద శక్తులను దేశం నుంచి ఇది ఒక ఆరంభం మాత్రమేనని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథంతో కూడిన విద్యను అందిస్తూ వారిలో సృజనాత్మక శక్తిని వెలుగు చేసేందుకు ఈ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

➡️