యువజన విభాగాలు మరింత బలోపేతం

రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా జిల్లా యువజన విభాగం, అనుబంధ విభాగాలు పనిచేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. యువజన విభాగం జిల్లా

మాట్లాడుతున్న కృష్ణదాస్‌

వైసిపి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా జిల్లా యువజన విభాగం, అనుబంధ విభాగాలు పనిచేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.వి.స్వరూప్‌ అధ్యక్షతన నగరంలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో శనివారం వైసిపి యువజన విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సిఎం జగనకే దక్కుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన జగన్‌ అని కొనియాడారు. స్వరూప్‌ మాట్లాడుతూ సచివాలయానికి 20 మంది చొప్పున, మండలానికి 500 మంది, నియోజకవర్గానికి రెండు వేల మందితో నియోజకవర్గ యువజన కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. వీరంతా జగనన్న సైనికులుగా ఓ సమూహంలా తయారై పార్టీ బలోపేతానికి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. మండలానికి ఒక జనరల్‌ సెక్రెటరీతో, ఇద్దరు సెక్రటరీలతో, ఇద్దరు ఉపాధ్యక్షులతో కలిసి ఐదుగురితో మండల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సమస్యలను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, నక్క రామరాజు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంపోలాకి : నరసన్నపేట మండలం చిక్కాలవలస, పోలాకి మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో సచివాలయం పరిధి రైతు భరోసా కేంద్రంలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపిలు ఆరంగి మురళీధర్‌, ముద్దాడ బైరాగి నాయుడు, వైసిపి నాయకులు కణితి కృష్ణారావు, సొసైటీ సిఇఒ రాంబాబు, పిఎసిఎస్‌ అధ్యక్షులు పోన్నాన దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

➡️