రుణాల రికవరీ వేగవంతం

రుణాల రికవరీ వేగవంతం చేయాలని డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ సూచించారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని

మాట్లాడుతున్న డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌

డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌

ప్రజాశక్తి- కొత్తూరు

రుణాల రికవరీ వేగవంతం చేయాలని డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ సూచించారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఇందులో భాగంగా వెలుగు ఉద్యోగులతో సమీక్షించారు. ఈ ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, టిఎస్‌పి రుణాల రికవరీపై నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోకపోవడంపై పంచాయతీల వారీగా అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు విభాగాల్లో వంద శాతం రుణ రికవరీ ఉండాలన్నారు. లేకుంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జలజీవన్‌ మిషన్‌ పనుల్లో పురోగతికి తక్షణమే కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. దానికి బ్యాంకు ఖాతాలను సోమవారం సాయంత్రానికి ప్రారంభించాలని సూచించారు. లక్ష్యం చేరుకోకపోతే సిబ్బంది చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జగనన్న తోడు రుణాలు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి మహిళా సంఘాన్ని గ్రేడ్‌-ఎలో ఉంచేలా చూడాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎపిఎం జనార్థన, సిసిలు అరుణజ్యోతి, గోవిందరావు, ప్రమీల పాల్గొన్నారు.

 

➡️