రేపు జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశాలు

జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను

జిల్లా పరిషత్‌ కార్యాలయం

ప్రజాశక్తి – శ్రీకాకుళం

జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల పదో తేదీన నిర్వహించనున్నట్లు జెడ్‌పి సిఇఒ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటలకు 6వ స్థాయి, 11 గంటలకు 3వ స్థాయి, మధ్యాహ్నం 12 గంటలకు ఐదో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు 2వ స్థాయి, మూడు గంటలకు 4వ స్థాయి, సాయంత్రం నాలుగు గంటలకు 7వ స్థాయి, ఐదు గంటలకు ఒకటో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

➡️