రేపు షర్మిల జిల్లా పర్యటన

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ

షర్మిల, కాంగ్రెస్‌ పిపిసి అధ్యక్షులు

  • ఇచ్ఛాపురంలో కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం
  • డిసిసి అధ్యక్షులు పి.పరమేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షులుగా వైఎస్‌ షర్మిల బాధ్యతల స్వీకరణ అనంతరం తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. 23న విశాఖపట్నం నుంచి రోడ్డుమార్గాన ఉదయం పది గంటలకు ఇచ్ఛాపురం చేరుకుంటారని తెలిపారు. కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ముగించిన విజయ స్థూపం వద్దకు వెళ్లి ఆయనకు నివాళ్లర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఇచ్ఛాపురం పట్టణంలోని ఆర్‌.జె ఫంక్షన్‌ హాలులో నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. ఆమెతో పాటు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలకడంతో పాటు విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 

➡️