రైళ్ల రద్దుతో బోసిపోయిన రైల్వేస్టేషన్‌

రాష్ట్రంలో మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో రైల్వే అధికారులు ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ నుంచి అటు

ప్రయాణికులు లేక బోసిపోయిన రైల్వే ప్లాట్‌ఫారం

ప్రజాశక్తి- ఆమదాలవలస

రాష్ట్రంలో మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో రైల్వే అధికారులు ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ నుంచి అటు భువనేశ్వర్‌ వైపు ఇటు విజయవాడ వైపు వెళ్లే రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయడంతో రైల్వేస్టేషన్‌ ఆవరణ, ప్లాట్‌ పామ్‌పై ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది. సోమవారం ఉదయం భువనేశ్వర్‌ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే విజయవాడ వైపు వెళ్ళింది. సాయంత్రం ఫలక్‌నుమ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే నడుస్తున్నట్లు మిగిలిన రైళ్లు అన్ని రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు రద్దుతో ప్రయాణికులు ఎవరూ రైల్వేస్టేషన్‌కు రాకపోవడంతో స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా దర్శనం ఇవ్వడంతో రైల్వేస్టేషన్‌ బోసిపోయింది. మరో రెండు రోజుల పాటు రైళ్లన్ని రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

 

➡️