వికలాంగులకు అండ

వికలాంగులకు శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగన్‌ కౌశ్‌ వికాస్‌, రాజ్‌గారి సేతు పథకాలను

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

వికలాంగులకు శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగన్‌ కౌశ్‌ వికాస్‌, రాజ్‌గారి సేతు పథకాలను రూపొందించిందని, వీటిని సద్వినియోగం చేసుకునేందుకు నమోదు చేసుకునేందుకు డిజిటల్‌ పోర్టల్‌ను రూపొందించిందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు తెలిపారు. జిల్లా న్యాయ సదన్‌లో వికలాంగులకు శనివారం న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగులకు నైపుణ్య శిక్షణ అందిస్తుందని అన్నారు. న్యాయవాది అన్నెపు భువనేశ్వరావు వికలాంగులకు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలను గురించి అవగహన కల్పించారు. కార్యక్రమంలో వికలాంగులశాఖ ఎడి కవిత, నర్మజ, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్‌ పాల్గొన్నారు.

 

➡️