విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

మండలం తాడివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పిఎంసి చైర్మన్‌ తమ్మినైన ప్రసాదరావు చేతులమీదుగా శుక్రవారం విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యకోసం

పొందూరు : ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్న పిఎంసి చైర్మన్‌

పొందూరు: మండలం తాడివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పిఎంసి చైర్మన్‌ తమ్మినైన ప్రసాదరావు చేతులమీదుగా శుక్రవారం విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యకోసం ట్యాబ్‌లను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం జి.సాయికుమార్‌, వైసిపి నాయకులు పైడి పోలయ్య, ఉపాధ్యాయులు గురుగుబెల్లి గోపాలరావు, చౌదరి వేణుగోపాల్‌, ధవళ పెంటయ్య పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి .వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు ఎపి మోడల్‌ స్కూల్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి చేతుల మీదుగా 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ విద్యార్దులు డిజిటల్‌ పరిజ్ఞానంతో వారి ఉన్నత చదువులు సాగించడానికి సిఎం జగన్‌ ఈ టాబ్‌ల పంపిణీ చేపట్టి, విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్‌ సుగ్గు ప్రేమ్‌ కుమార్‌, పట్టణ వైసిపి అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌ పట్నాయక్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ డి.వైకుంఠరావు, విద్యార్థులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

➡️