వైసిపి పేదల ప్రభుత్వం

వైసిపి పేదల ప్రభుత్వం, సిఎం జగన్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పశుసంవర్థకశాఖ

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

వైసిపి పేదల ప్రభుత్వం, సిఎం జగన్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని గోవిందపురం, ఉద్ధానం గోపీనాథపురం, అమలపాడు, పెద్దమురాహారిపురం సచివాలయం భవనాలు, పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనులు, రూ.1.50 కోట్లతో నిర్మించిన బిటి రోడ్డు, రైతు భరోసా కేంద్రాలను శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని అన్నారు. పేదలు ఆత్మాభిమానంతో తమ పిల్లలను గౌరవ ప్రథమంగా కార్పొరేట్లకు ధీటుగా నిలిచే ప్రభుత్వ బడులకు పంపిస్తున్నారు. దీనికి కారణం వైసిపి ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌ నాయుడు రెండు పర్యాయాలు పని చేసిన ఆయన జిల్లాకు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థనైన తీసుకొచ్చారా? అని ప్రశ్నిం చారు. ఎంపీ పదవి రైల్వే స్టేషన్లలో బెంచిల ఏర్పాటుకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్దాల మేనిఫెస్టోతో ఎన్నికలు కోసం సిద్దమయ్యాడని విమర్శిం చారు. టిడిపి నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వారిని నిలదీయాలని కోరారు. వలసల నివారణకు, ఉద్యోగ కల్పనకు మూలపేట పోర్టు ఉపయోగపడుతుం దని, దేనిపనులు సెరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో చాలా బిటి రోడ్లు వైసిపి హయాంలో ప్రారంభించామని తెలిపారు. వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ మాట్లాడు తూ చంద్రబాబు మాయ మాటలు నమ్మి గతంలో ప్రజలు మోసపోయారని, ఇప్పుడు అటువంటి అవకాశం టిడిపికి ఇవ్వకుడదాని అన్నారు. గౌతు శిరీషకు పేదల కష్టాలపై అవగాహన లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పాలిన శ్రావణి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పాలిన శ్రీనివాసరావు, సర్పంచ్‌లు పాలిన రమ్యచిరంజీవి, కర్ని శ్రీను, దున్ను రత్నం బాలరాజు, గోరకల విశ్వనాథం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు దున్న వీరాస్వామి, పాలిన ఉమామహేశ్వరరావు, మద్దిల హరినారాయణ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

 

➡️