శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం రేంజ్‌ డిఐజి ఎస్‌.హరికృష్ణ హెచ్చరించారు. కాశీబుగ్గ డిఎస్‌సి కార్యాలయం, సర్కిల్‌ పోలీస్‌ను ఆదివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన పోలీస్‌స్టేషన్‌లో

గౌరవ వందనం స్వీకరిస్తున్న డిఐజి హరికృష్ణ

విశాఖపట్నం రేంజ్‌ డిఐజి హరికృష్ణ

ప్రజాశక్తి- పలాస

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం రేంజ్‌ డిఐజి ఎస్‌.హరికృష్ణ హెచ్చరించారు. కాశీబుగ్గ డిఎస్‌సి కార్యాలయం, సర్కిల్‌ పోలీస్‌ను ఆదివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన పోలీస్‌స్టేషన్‌లో వివిధ కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. అలాగే డిఎస్‌పి కార్యాలయంలో డివిజన్‌కు సంబంధించిన మొత్తం పోలీస్‌ స్టేషన్ల వారీగా తనిఖీలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుల విభాగంలో రికార్డులు పరిశీలించి నిత్యం నమోదు అవుతున్న కేసులు నమోదు చేయాలని సూచించారు. అంతకుముందు డిఐజికి పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈయన వెంట డిఎస్‌పి నాగేశ్వరరెడ్డి, సిఐలు నవీన్‌కుమార్‌, శంకరరావు, మల్లేశ్వరరావు ఉన్నారు.

 

➡️