సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే గ్రామాలు శిథిలమైపోతాయని, గ్రామీణ

ధర్నా నిర్వహిస్తున్న సర్పంచ్‌లు

ఆర్థిక సంఘం నిధుల దారిమళ్లింపు తగదు

పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌

కలెక్టరేట్‌ వద్ద వద్ద సర్పంచ్‌ల ధర్నా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే గ్రామాలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలి పోతుందని పంచాయతీ రాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.రాజేంద్రప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని కార్యాలయం ఎదుట సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ ఆధ్వర్యాన గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో 3 కోట్ల, 50 లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఉన్న నిధులను సైతం బ్యాంకు ఖాతాల నుంచి అపహరించిన చరిత్ర హీనుడు జగన్‌ అని విమర్శించారు. గ్రామ స్వరాజ్యస్థాపన కోసం గాంధీ మహాత్ముడు కలలు కన్నారని, అటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు గ్రామాల్లో విలువ లేకుండా చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో సర్పంచ్‌లు తమ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ మాట్లాడుతూ ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్న 16 సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గడచిన నాలుగేళ్లలో అనేక పోరాటాలు చేసినా చలనం లేదన్నారు. 14 ,15 ఆర్థిక సంఘం నిధులు రూ.వేల కోట్లు దారిమళ్లించిందన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల వల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ పతనమైందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీముత్యాలరావు, పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాపరెడ్డి, చుక్క ధనుంజయ యాదవ్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణ, సర్పంచుల సంఘం ఆర్గనైజ్‌ సెక్రెటరీ పిన్నింటి వెంకట భానోజీనాయుడు, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.అప్పలనాయుడు, జనసేన సర్పంచ్‌ గోవిందరెడ్డి, రైతు శ్రీనివాసరావు, శ్రీకాకుళం నియోజకర్గ సర్పంచ్‌ సంఘం అధ్యక్షులు కొంక్యాన ఆదినారాయణ, సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షులు రుప్ప లక్ష్మీరమణమూర్తి పాల్గొన్నారు. ధర్నా నిర్వహిస్తున్న సర్పంచ్‌లు సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం అఆర్థిక సంఘం నిధుల దారిమళ్లింపు తగదు అపంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌అకలెక్టరేట్‌ వద్ద వద్ద సర్పంచ్‌ల ధర్నా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే గ్రామాలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలి పోతుందని పంచాయతీ రాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.రాజేంద్రప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని కార్యాలయం ఎదుట సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ ఆధ్వర్యాన గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో 3 కోట్ల, 50 లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఉన్న నిధులను సైతం బ్యాంకు ఖాతాల నుంచి అపహరించిన చరిత్ర హీనుడు జగన్‌ అని విమర్శించారు. గ్రామ స్వరాజ్యస్థాపన కోసం గాంధీ మహాత్ముడు కలలు కన్నారని, అటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు గ్రామాల్లో విలువ లేకుండా చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో సర్పంచ్‌లు తమ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ మాట్లాడుతూ ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్న 16 సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గడచిన నాలుగేళ్లలో అనేక పోరాటాలు చేసినా చలనం లేదన్నారు. 14 ,15 ఆర్థిక సంఘం నిధులు రూ.వేల కోట్లు దారిమళ్లించిందన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల వల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ పతనమైందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీముత్యాలరావు, పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాపరెడ్డి, చుక్క ధనుంజయ యాదవ్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణ, సర్పంచుల సంఘం ఆర్గనైజ్‌ సెక్రెటరీ పిన్నింటి వెంకట భానోజీనాయుడు, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.అప్పలనాయుడు, జనసేన సర్పంచ్‌ గోవిందరెడ్డి, రైతు శ్రీనివాసరావు, శ్రీకాకుళం నియోజకర్గ సర్పంచ్‌ సంఘం అధ్యక్షులు కొంక్యాన ఆదినారాయణ, సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షులు రుప్ప లక్ష్మీరమణమూర్తి పాల్గొన్నారు.

 

➡️