సిఎం దృష్టికి సోంపేట సమస్యలు

సోంపేట మండలంతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఎంపిపి డాక్టర్‌ నిర్మాణ దాసు సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కోరారు. గురువారం కంచిలి మండలం మకరాంపురం వైఎస్‌ఆర్‌ సుజలధార పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసిన

సీఎం జగన్‌ను కలిసిన ఎంపిపి డాక్టర్‌ నిమ్మన దాసు

ప్రజాశక్తి- సోంపేట

సోంపేట మండలంతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఎంపిపి డాక్టర్‌ నిర్మాణ దాసు సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కోరారు. గురువారం కంచిలి మండలం మకరాంపురం వైఎస్‌ఆర్‌ సుజలధార పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సిఎంను కలిసి పలు సమస్యలను వివరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జలవనరులు, పైడిగాం ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులు, సోంపేట టౌన్‌లో రోడ్‌ వైండింగ్‌ పనులపై వినతిపత్రం అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంపిపి దాసు పేర్కొన్నారు.సోంపేటను కరువు మండలంగా ప్రకటించాలిసోంపేటను కరువు మండలంగా ప్రకటించాలని జెడ్‌పిటిసి తడక యశోద కోరారు. కంచిలి మండలం మకరాపురంలో నిర్మించిన వైఎస్‌ఆర్‌ సుజలధార ప్రారంభోత్స వానికి విచ్చేసిన సిఎం జగన్మోహన్‌ రెడ్డికి జెడ్‌పిటిసి, మండల వైసిపి నాయకులు, పలాసపురం గ్రామ సర్పంచ్‌ తడక జోగారావు కలిసి పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. పైడిగం ఛానల్‌ నుంచి పలాసపురం వరకు టైలాండ్‌ బట్టి సిమెంట్‌తో చేయాలని, మహేంద్ర తనయ నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సోంపేట, జింకీభద్ర, బెంకలి, పలాసపురం గ్రామాలకు నీరు అందించాలని, మెయిన్‌రోడ్డు విస్తరించాలని, బారువలో జగనన్న కాలనీ ఇళ్లను సముద్రం ఒడ్డున కాకుండా వేరే దగ్గరికి మార్చాలని కోరారు. సిఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

 

➡️