సైబర్‌ నేరాలపై అప్రమత్తం

సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రతిఒక్కరూ సైబర్‌ నేరాలపై

జి.ఆర్‌ రాధిక, ఎస్‌పి

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం

సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రతిఒక్కరూ సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ప్రకటనలో సూచించారు. కొందరు నేరస్తులు నేరుగా మీ ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి మీరు కొరియర్‌ రూపంగా డ్రగ్స్‌ బుక్‌ చేశారని, మీ చిరునామకు మాదకద్రవ్యాలు వచ్చాయని, తాము ముంబై, ఢిల్లీ, నార్కోటిక్స్‌ పోలీసులమంటూ వీడియో కాల్‌ చేసి నమ్మబలికే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మీపై కేసు లేకుండా ఉండాలంటే డబ్బు ఇమ్మని మోసం చేసి నగదును డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌కు స్పందించద్దని, అలాంటి మోసగాళ్ల వివరాలు మీ సమీపంలోని పోలీసులకు తెలియజేయాలన్నారు. ఆన్‌లైన్‌ ఉద్యోగ పేరిట ఉద్యోగపు ఆశ చూపే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నాఉ. వారిని నమ్మి మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదని అన్నారు. పార్ట్‌ టైం జాబ్స్‌ పేరిట వచ్చే లింక్స్‌ క్లిక్‌ చేసి మోసపోకండని అన్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలకు గురికావద్దన్నారు. ఇంటర్నెట్‌లో గూగుల్‌ వగైరా సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా ఏదైనా ఆన్‌లైన్‌ ఫిర్యాదు చేద్దామని మీరు ఏదైనా కంపెని పేర్లు, కస్టమర్‌ కేర్‌ నంబర్లను వెతికే క్రమంలో మోసగాళ్లకు ఫోన్‌ చేయవద్దన్నారు గుర్తు తెలియని, అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింకులకు క్లిక్‌ చేయరాదన్నారు. ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్‌ హెల్ప్‌ లైన్‌ నంబరు 1930ను తక్షణమే సంప్రదించాలన్నారు. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ షషష.షybవతీషతీఱఎవ.స్త్రశీఙ.ఱఅలో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.

 

➡️