25న జాతీయ ఓటరు దినోత్సవం

Jan 21,2024 21:19
ఓటు ప్రాధాన్యం తెలిసేలా

ఎం.నవీన్‌, ఇన్‌ఛార్జి కలెక్టర్‌

  • ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఓటు ప్రాధాన్యం తెలిసేలా 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ‘నథింగ్‌ లైక్‌ ఓటింగ్‌’, ‘ఐ ఓట్‌ ఫర్‌ ష్యూర్‌’ నినాదాలతో ఓటరు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా, బూత్‌స్థాయిలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా యువత, సీనియర్‌ సిటిజన్లకు ఓటరు దినోత్సవ అవశ్యకత తెలియజేయాలని పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌ల్లో నిర్వహించే కార్యక్రమాల్లో కొత్త ఓటరుగా నమోదైన వారికి ఎపిక్‌ కార్డులు అందించి సత్కరించాలని ఎఇఆర్‌ఒలు, ఇఆర్‌ఒలు అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

➡️