30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

0 శాతం ఐఆర్‌ను, పెండింగ్‌

మెకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు

  • యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌కుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

30 శాతం ఐఆర్‌ను, పెండింగ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర పిలుపు మేరకు పట్టణంలో యుటిఎఫ్‌ కార్యాలయం నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి, అక్కడ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకూ బుధవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరెండర్‌ లీవ్‌లు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌, డిఎలు, పిఆర్‌సి రూపంలో రూ.18 కోట్లు పెండింగ్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ప్రతి పోరాట సందర్భంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడుతుందని అన్నారు. అప్రజాస్వామ్య వైఖరి విడనాడాలన్నారు. అలాగే మెగా డిఎస్‌సి నోట ిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తుంటే ఉపాధ్యాయులపై నిర్బంధాలు, అక్రమంగా కేసులు పెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారని, ఇది సరికాదని హితవుపలికారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎల్‌.బాబూరావు, సహధ్యక్షలు బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, జిల్లా కార్యదర్శి హనుమంతు అన్నాజీరావు, బి.శంకరరావు, పి.సూర్యప్రకాషరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, పి.మురళీధర్‌రావు, జి.సురేష్‌, రాష్ట్ర కౌన్సిలర్లు పి.అప్పారావు, ఎస్‌.నారాయణరావు పాల్గొన్నారు.

 

➡️