374 పశువులకు టీకాలు

మండలంలోని కురుడు పంచాయతీ పరిధిలో ఉన్న చౌ

టీకాలు వేస్తున్న డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

మండలంలోని కురుడు పంచాయతీ పరిధిలో ఉన్న చౌదరికొత్తూరు, బావాజీపేట, యరకయ్యపేట, పొన్నానపేట, అలాగే యలమంచిలి పంచాయతీలో నూకపేట, యలమంచిలి గ్రామాల్లో 374 పశువులకు శనివారం ఉచిత జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేశామనిస్థానిక పశువైద్యాధికారి డాక్టర్‌ లఖినేని కిరణ్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ టీకాలు షెడ్యూల్‌ ప్రకారం వేస్తున్నామని తెలిపారు. రైతులందరూ పశు వైద్య సిబ్బందికి సహకరించి తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. సరైన కాలంలో సక్రమంగా టీకాలు వేయించుకుంటే వ్యాధులు రాకుండా నివారించ్చునన్నారు. ఈ వ్యాధి బారిన పడిన పశువులు ఎక్కువగా మృతి చెందాయని చెప్పారు. మూడు మాసాల నుంచి ఏడు మాసాలు దూడలు ఈ వ్యాధి బారిన పడి 90 శాతం దూడలు మృతి చెందుతాయని అన్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు మేత ఆపడం, లేవలేకపోవడం ఎక్కువగా వెనుక కాళ్ల కండరాలలో గాలి చేరి, కణజాలము కుళ్లుతుందన్నారు. దీనివల్ల అధికంగా 104-105 డిగ్రీల జ్వరం వచ్చి చనిపోతుంటాయని తెలిపారు. పాడి రైతులు తమ పశువులను ఉచిత టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్‌ కె.ముకుందరావు, శోభ, సహాయకులు నారాయణరావు పాల్గొన్నారు.

 

➡️