కిసాన్‌ సమ్మన్‌ నిధితో ప్రయోజనం

ప్రజాశక్తి-దర్శి : కిసాన్‌ సమ్మన్‌ నిధితో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని కెవికె ఇన్‌ఛార్జి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.సంధ్యారాణి తెలిపారు. ప్రధానమంత్రి సమ్మన్‌ నిధి కింద నరేంద్ర మోడీ విడుదల చేసిన నగదును గురించి డాక్టర్‌ సంధ్యారాణి రైతులకు వివరించారు. తొలుత శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంటలలో నూతనంగా వచ్చే మార్పులను, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల గురించి డాక్టర్‌ సంధ్యారాణి వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ శివలీలకష్ణ పాల్గొన్నారు.

➡️