భావనపాడులో వలలు దగ్ధం

సంతబొమ్మాళి మండలం

కాలిపోయిన వలలు చూపిస్తున్న ఆదినారాయణ

ప్రజాశక్తి – నౌపడ

సంతబొమ్మాళి మండలం భావనపాడులో మత్స్యకార సొసైటీ అధ్యక్షులు గొరకుల ఆదినారాయణకు చెందిన రెండు వలలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీనిపై ఆయన నౌపడ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీని విలువ రూ.12 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. వేట విరామ సమయంలో కొద్ది రోజులుగా హార్బర్‌లో ఎప్పుడూ దాచుకున్న చోటే వలలు ఉంచానని, మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి వలలు దగ్ధమై ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నందున ప్రమాదవశాత్తు ఇది జరిగిందా..?, ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే చేశారా? అన్నది తెలియడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

➡️