5న ఇచ్ఛాపురంలో లోకేష్‌ పర్యటన!

5న ఇచ్ఛాపురంలో లోకేష్‌ పర్యటన!

స్థల పరిశీలన చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఫిబ్రవరి ఐదో తేదీన ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. లోకేష్‌ పర్యటన ఉంటుందన్న ప్రాథమిక సమాచారం నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ సూచనలతో టిడిపి నాయకులు ఎన్‌.జాని, వార్డు కౌన్సిలర్లు లీలారాణి, కె.దిలీప్‌ కుమార్‌, పి.తవిటయ్య, మణి తదితరులు మంగళవారం స్థల పరిశీలన చేశారు.

 

➡️