ఏజెంట్లను నియమించుకోవాలి

జూన్‌ నాలుగో తేదీన

సమావేశంలో మాట్లాడుతున్న భరత్‌ నాయక్‌

ప్రజాశక్తి – పలాస

జూన్‌ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవాలని పలాస ఆర్‌డిఒ, రిటర్నింగ్‌ అధికారి భరత్‌ నాయక్‌ తెలిపారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఆయా అభ్యర్థులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏజెంట్ల నియామకం, నిర్వహించనున్న విధులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పలాస స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌కు వచ్చే నెల మూడో తేదీన తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తహశీల్దార్‌ ఎస్‌.ఎస్‌.వి నాయుడు, అభ్యర్థుల ప్రతినిధులు అల్లు వెంకటరమణ, పండా, అనిల్‌రాజు, అఖిలేష్‌ యాదవ్‌, జయదేవ్‌, పోతనపల్లి అప్పలస్వామి, రవి పాల్గొన్నారు.

➡️