అట్టహాసంగా రెడ్డి శాంతి నామినేషన్‌

పాతపట్నంపాతపట్నం నియోజ కవర్గం లో వైసిపి ఎమ్మెల్యే

నామినేషన్‌ వేస్తున్న రెడ్డి శాంతి

ప్రజాశక్తి- పాతపట్నం

పాతపట్నం నియోజ కవర్గం లో వైసిపి ఎమ్మెల్యే రెడ్డి శాంతి అట్టహాసంగా సోమవారం నామినేషన్‌ వేశారు. ముందుగా స్థానిక నీలమణి దుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అన ంతరం వైసిపి కార్యాలయం నుంచి తహశీల్దా్‌ కార్యాలయం వరకూ జనసందోహం మధ్య ర్యాలీ నిర్వహించారు. అనంతరం మధ్య హ్నం ఒంటి గంటకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, తహశీల్దార్‌ రామరాజుకు నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో నరసన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి తమ్ముడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, ఆమె ఇద్దరు కుమారులు, నాయకులు కార్య కర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️