బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు

మండలంలోని తీరప్రాంత గ్రామాలైన

చెలమల ద్వారా నీటిని తోడుతున్న మహిళలు

తీర ప్రాంతాల్లో దాహం కేకలు

ప్రభుత్వాలు మారుతున్నా శాశ్వత పరిష్కారానికి నోచుకోని వైనం

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

మండలంలోని తీరప్రాంత గ్రామాలైన డొంకూరు, శివకృష్ణాపురం, పెద్దలక్ష్మీపురం, చిన్నలక్ష్మీ పురం గ్రామాల్లో ఏటా వేసవి నీటి కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా తీరప్రాంత నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం నేటి వరకు లభించలేదని తీర ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతుండడంతో బిందెడు నీటి కోసం బండెడు కష్టం పడుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా చెలమల జలాన్ని వినియోగించి రోగాల పాలవుతున్నారు. ఇచ్ఛాపురంలో దాహార్తి తీర్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వేకువజామున మహిళలు లేచి చెలమలు ద్వారా సేకరించిన నీటిని తీసుకెళ్తున్నరు. బిందెడు నీటికి పోరాటం చేస్తున్నారు. తీరా ప్రాంతాల్లో డొంకూరు, చిన్నలక్ష్మీపురం, శివకష్ణాపురం గ్రామాల్లో నీటి చుక్క కోసం పోరాటం నిత్యకృత్యమైపోయింది. మూడు వేల కుటంబాలు నివసించే ఆ గ్రామాల్లో కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరానికి చేరుకొని ఇసుక దిబ్బలను లోతుగా తవ్వి కొంచెం కొంచెగా నీటిని సేకరిస్తారు. గంట తవ్వితే బిందె నీరు దొరుకుతుందని మహిళలు బాధతో చెబుతున్నారు. అక్కడే రెండు నుంచి మూడు గంటలు ఉంటాం. దీంతో ఉపాధి పనులకు వెళ్లాలన్నా, వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ నీటి కష్టాలు తప్పడం లేదని, అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యలు తప్ప… శాశ్వత పరిష్కారం వరకు చేపట్టలేదని వాపోయారు. చర్యలు తీసుకుంటాంతీరప్రాంత గ్రామ పంచాయతీలో తాగునీరు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎఇ విష్ణుమూర్తి తెలిపారు. ఉద్దానం నీటి సరఫరా పథకం నుంచి నేరుగా డొంకూరు ట్యాంకర్‌కు కనెక్షన్‌ ఇస్తున్నామని అన్నారు. దీంతో పాటు తీర ప్రాంతలో ప్రత్యేకంగా బావి తవ్విస్తున్నామని తెలిపారు. మూడు రోజుల్లో గ్రామాలకు తాగునీరు అందించే చర్యలు తీసుకున్నామని చెప్పారు.

➡️