క్రీ’డల్‌’ మైదానొంవృథాగా భవనాలు

క్రీడల పరంగా టెక్కలి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే

వినియోగం లేక శిథిలావస్థకు

తుప్పు పడుతున్న సామగ్రి

ప్రజాశక్తి- టెక్కలి

క్రీడల పరంగా టెక్కలి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అప్పటి క్రీడాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హయాంలో ప్రారంభమైన మినీ స్టేడియం పనులు ఆర్ధాతరంగా నిలిచిపోయాయి. నిర్మించిన భవనాలు వినియోగం లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కొన్ని పరికరాలు, వస్తువులు తుప్పుపడుతున్నాయి. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్‌టిఆర్‌ క్రీడా వికాస కేంద్రం పేరుతో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఇండోర్‌ స్టేడియం ఆరున్నరేళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు. అనంతరం భవనాలు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రన్నింగ్‌ ట్రాక్‌ని 400 మీటర్ల స్థాయికి విస్తరించాలనే ఉద్దేశంతో పనులు ప్రారంబించారు. అయితే విస్తీర్ణం చాలకపోవడంతో డిగ్రీ కళాశాల మైదానానికి ఆనుకుని ఉన్న ఆలయ స్థలంలో కొంత భాగం సేకరించి నిర్మాణం చేపట్టాలని అప్పట్లో మంత్రి అచ్చెన్నాయుడు ఆలోచించారు.ఆలోచన కార్యరూపం దాల్చకపోవడమతో డిగ్రీ కళాశాల మైదానా నికి సరిహద్దులు సూచించే ప్రహరీ కూల్చివేసి వదిలేశారు. ఆక్రమణకు గురవుతున్న ప్రహరీప్రస్తుతం కళాశాల మైదానానికి ఆనుకుని ఉన్న స్థలం ఆక్రమణకు గురవుతుంది. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాల్లో ఒక్క షటిల్‌ కోర్టు భవనం మాత్రమే వినియోగంలోకి ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చించి జిమ్‌ పరికరాలు కొనుగోళ్లు చేశారు. అవి కొన్ని నెలల పాటు వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే వాటిని నిర్వహించడానికి సరైన కోచ్‌ లేక అది మూతపడింది. దీంతో జిమ్‌ పరికరాలు వినియోగం లేక తుప్పు పడుతు న్నాయి. క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చదరంగం, క్యారమ్స్‌, వంటి క్రీడలను తీసుకొచ్చారు. కానీ, అవి ప్రారంభానికి నోచుకోలేదు. భవనాలు వినియోగించక పోవడం, నిర్వహణ లేక పోవడంతో గదులు అపరిశుభ్రత వాతావరణం మధ్య ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన భవనాలు వినియోగంలోకి రాకపోవడంతో నియో జకవర్గం క్రీడాపరంగా వెనుకబడి ఉందనే చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు వీటి వినియోగంపై ఏ రీతిన స్పందించి భవనాలు వినియోగంలోకి తీసుకువస్తారో వేచి చూడాలి.

➡️