నామినేషన్లకు ముగిసిన ఘట్టం

సార్వత్రిక ఎన్నికల్లో

నామినేషన్‌ వేస్తున్న గొండు శంకర్‌

  • ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 131
  • నామినేషన్లుశ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి 16 నామినేషన్లు
  • నేడు నామినేషన్ల పరిశీలన

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ఉత్సాహం చూపారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 147 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 131 నామినేషన్లు దాఖలు కాగా, శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి 16 నామినేషన్లు వచ్చాయి. వీటిని శుక్రవారం పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 29వ తేదీ తుది గడువు. అదే రోజు సాయంత్రం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన ఈనెల 18 నుంచి గడువు ముగిసిన 25వ తేదీ వరకు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 131 మంది అభ్యర్థులు 216 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు 129 నామినేషన్లు, లోక్‌సభకు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో అత్యధికంగా పాతపట్నం అసెంబ్లీ స్థానానికి 24 మంది, అత్యల్పంగా నరసన్నపేట అసెంబ్లీ స్థానానికి 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఆమదాలవలస మినహా ఎక్కడా రెబల్స్‌ సమస్య తల్తెలేదు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తక్కువ సంఖ్యలోనే నామినేషన్లు వేశారు. నామినేషన్ల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ భారీగా జనసమీకరణ చేసి బలప్రదర్శన చేపట్టాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో పార్టీలన్నీ పూర్తిగా ప్రచారంపై దృష్టిసారించనున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో…శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మంత్రి ధర్మాన ప్రసాదరావు (వైసిపి), గొండు శంకర్‌ (టిడిపి), అంబటి కృష్ణారావు (కాంగ్రెస్‌) ఉన్నారు.నరసన్నపేట నియోజకవర్గంలో…నరసన్నపేట అసెంబ్లీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ధర్మాన కృష్ణదాస్‌ (వైసిపి), బగ్గు రమణమూర్తి (టిడిపి), మంత్రి నర్సింహమూర్తి (కాంగ్రెస్‌) ఉన్నారు.టెక్కలి నియోజకవర్గంలో…టెక్కలి అసెంబ్లీ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కింజరాపు అచ్చెన్నాయుడు (టిడిపి), దువ్వాడ శ్రీనివాస్‌ (వైసిపి), కిల్లి కృపారాణి (కాంగ్రెస్‌) ఉన్నారు.పలాస నియోజకవర్గంలో…పలాస అసెంబ్లీ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సీదిరి అప్పలరాజు (వైసిపి), గౌతు శిరీష (టిడిపి), మజ్జి త్రినాథ్‌బాబు (కాంగ్రెస్‌) ఉన్నారు.ఇచ్ఛాపురం నియోజకవర్గంలో…ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానానికి మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బెందాళం అశోక్‌ (టిడిపి), పిరియా విజయ (వైసిపి), చక్రవర్తి రెడ్డి (కాంగ్రెస్‌) ఉన్నారు.పాతపట్నం నియోజకవర్గంలో…పాతపట్నం అసెంబ్లీ స్థానానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రెడ్డి శాంతి (వైసిపి), మామిడి గోవిందరావు (టిడిపి), కె.వెంకటరావు ఉన్నారు.ఆమదాలవలస నియోజకవర్గంలో…ఆమదాలవలస అసెంబ్లీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ్మినేని సీతారాం (వైసిపి), కూన రవికుమార్‌ (టిడిపి), సనపల అన్నాజీరావు (కాంగ్రెస్‌), సువ్వారి గాంధీ (ఇండిపెండెంట్‌, వైసిపి రెబల్‌) ఉన్నారు.ఎచ్చెర్ల నియోజకవర్గంలో…ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానానికి మొత్తం 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు గొర్లె కిరణ్‌కుమార్‌ (వైసిపి), ఎన్‌.ఈశ్వరరావు (బిజెపి), కె.మల్లేశ్వరరావు (కాంగ్రెస్‌) ఉన్నారు.ఎంపీ స్థానానికి11 నామినేషన్లు దాఖలుశ్రీకాకుళం ఎంపీ స్థానానికి మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టిడిపి), పేరాడ తిలక్‌ (వైసిపి), పేడాడ పరమేశ్వరరావు (కాంగ్రెస్‌) ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్‌ వేస్తున్న గొండు శంకర్‌

➡️