టిడిపి అభ్యర్థుల విస్తృత ప్రచారం

రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం

శ్రీకాకుళం అర్బన్‌ : సైకిల్‌ యాత్రలో పాల్గొన్న శంకర్‌

ప్రజాశక్తి- సోంపేట

రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని, చంద్రబాబును మరలా ముఖ్యమంత్రిని చేయాలని టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జనసేన నియోజకవర్గ నాయకులు దాసరి రాజు కోరారు. సోంపేట పట్టణంలోని పల్లివీధి ప్రాంతాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సూరాడ చంద్రమోహన్‌, చిత్రాడ శేఖర్‌, చిత్రాడ శ్రీను, మద్దెల నాగేశ్వరరావు, వి.గాంధీ, రెళ్ల శ్రీను, మడ్డు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పోలాకి : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి మండలంలోని గుప్పాడపేట పంచాయతీలోకొవిరిపేట, గుప్పంపిడిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకులు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పలాస : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర, జయరామచంద్రపురం, పద్మనాభపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయుడులకు మద్దతుగా టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వజ్జ బాబూరావు, లోడగల కామేశ్వరరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బడ్డ నాగరాజు గారు సప్ప నవీన్‌, జనసేన నాయకులు అట్టాడ వాసుదేవ్‌, నబిల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు : టిడిపి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషలను గెలిపించాలని కోరుతూ మండలంలోని కొత్తపేటలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, మాజీ ఎంపిపి వసంతస్వామి, గోవిందు పాపారావు, దున్న షణ్ముఖరావు, అట్టాడ రఘు, కంబాల దానేష్‌, చింతా యోగేష్‌ పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్‌: ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రత్యర్థిగా ఉన్న రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసత్య ఆరోపణలు, అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్దంగా కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్న ధర్మానపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని టిడిపి కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. శనివారం నగరంలోని 80 అడుగుల రోడ్డు నుంచి పాత బస్టాండ్‌, ఏడు రోడ్ల జంక్షన్‌, డేఅండ్‌నైట్‌, రైతు బజారు, రామలక్ష్మణ కూడలి, సూర్యమహల్‌, అరసవల్లి జంక్షన్‌ మీదుగా టిడిపి కార్యాలయం వరకు బిజెపి, జనసేన నాయకులతో కలిసి సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో విస్తృతస్థాయి కార్యకర్తల సమా వేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ఓటమి భయంతో తనపై సోషల్‌ మీడియా వేదికగా మార్ఫింగులతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉండి గడచిన ఐదేళ్లలో స్టేడియం పున: నిర్మాణం, శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు, ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌, గార మండలంలో ఎత్తిపోతల పథకం, వంతెన నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రజలు టిడిపి కూటమికి పట్టం కట్టాలన్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, శంకర్‌, బిజెపి నాయకులు వేణుగోపాల్‌, ఉమా మహేశ్వరరావు, టిడిపి నాయకులు పాండ్రంకి శంకర్‌, బొణిగి భాస్కరరావు పాల్గొన్నారు.

 

➡️