సచివాలయానికి పోయేదెలా…?

రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా

సచివాలయం ముందర రహదారిపై నిలిచిన వర్షపునీరు

ప్రజాశక్తి- పొందూరు

రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా కనిపిస్తున్న ఈ దృశ్యం పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలోనిది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు సచివాలయానికి పోయే రహదారిలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం ముందర ప్రధాన రహదారి ఎత్తుగా ఉండడంతో వర్షపునీరు వెళ్లడానికి వీలులేక ఇలా నిలిచిపోతుంది. దీంతో పలు సమస్యలపై సచివాలయానికి వెళ్లే ప్రజలు రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సచివాలయం ముందర రహదారి, కాలువలు నిర్మాణం చేపట్టాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.

 

➡️