విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

జిల్లాలో పది, ఇంటర్‌ల్లో ఉత్తమ మార్కులు సాధించిన

పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో పది, ఇంటర్‌ల్లో ఉత్తమ మార్కులు సాధించిన శిష్టకరణ విద్యార్థులకు ఆ సంఘం తరుపున ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. నగరంలోని శిష్టకరణ అసోసియేషన్‌ భవనంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ సంఘం తరుపున ఆదివారం సత్కరించారు. ఈ మేరకు మెడల్స్‌, జ్ఞాపికలను అందజేశారు. సంఘ నాయకులు పోలుమహాంతి ఉమామహేశ్వరరావు, డబ్బీరు శ్రీనివాసరావు (వాసు), బలివాడ మల్లేశ్వరరావుల ఆధ్వర్యాన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిభావంతులను స్ఫూర్తితో ప్రతిఒక్క విద్యార్థీ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విశ్రాంత సైంటిస్టు ఆరికతోట కనకరాజు నగదు, మెడల్స్‌ అందివ్వడం ఆనవాయిగా పెట్టుకుని ఈ ఏడాదీ అందజేశామని అన్నారు. కనకరాజు మాట్లాడుతూ విద్యార్థులు మరింత శ్రమించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో బెహర రామచంద్రరావు, సదాశివుని రామకృష్ణ, పట్నాయకుని మధు, ఆర్‌.వి.ఎన్‌.శర్మ, శ్రీనివాస్‌ పట్నాయక్‌, గోకుల్‌ విజరు, ఎస్‌.సంజీవరావు పాల్గొన్నారు.

 

➡️