హోం ఓటింగ్‌ విజయవంతం

ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం హోం ఓటింగ్‌

ఓటుహక్కును వినియోగించుకుంటున్న వృద్ధులు

ప్రజాశక్తి- రణస్థలం

ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం హోం ఓటింగ్‌ విధానం విజయవంతమైంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం ఎంతగానో ఉపయోగ పడింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు కొన్నిసార్లు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేకపోయేవారు. ఇప్పుడు ఇంటి నుంచి ఓటు ద్వారా వారంతా ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో వయోవృద్ధులు 53 మంది, వికలాంగులు 25 మంది ఓటు వేసి ఆనందం వ్యక్తం చేశారు. 80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగుల నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

 

➡️