జగన్‌వి శవ రాజకీయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన రాజకీయ

పలాస : మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- పలాస

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన రాజకీయ చరిత్రలో శవ రాజకీయాలు చేస్తున్నారని, జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి మృతి చెందితే ఒకవైపు తండ్రి దహన సంస్కారణలు చేయక ముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు నుంచి సంతకాల సేకరణ చేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. మండలంలోని గరుడఖండిలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సమక్షంలో శుక్రవారం 50 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తన చిన్నాన్న వివేకానంద రెడ్డి మృతిని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నదులను అనుసంధానం చేసి శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు రెండు పంటలు పండించేందుకు సాగునీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో మెగా డిఎస్‌సి విడుదల చేస్తామన్నారు. పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఐదేళ్లలో ఒక్క చుక్క వంశధార నీరు శివారు భూములకు సరఫరా చేయలేదన్నారు. పలాసలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు సైతం ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మంత్రి ఐదేళ్లలో తట్టెడు మట్టి వేయలేదన్నారు. వైసిపి నాయకులు మింగిన ప్రతి పైసానూ తిరిగి కక్కించి ప్రజల కోసం ఖర్చు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి దువ్వాడ కృష్ణమూర్తి నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు దువ్వాడ హేంబాబు చౌదరి, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు : మోసపూరిత హామీలతో వైసిపి అధికారంలోకి వచ్చిందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. మండలంలోని పల్లిసారథిలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, జనసేన, బిబెపి సమన్వయకర్తలు డాక్టర్‌ వి.దుర్గారావు, కొర్రాయి బాలకృష్ణ, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సూరాడ మోహనరావు, పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ దువ్వాడ హేమబాబు చౌదరి, మాజీ ఎంపిపి జి.వసంతస్వామి పాల్గొన్నారు.మందస : సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పిలుపునిచ్చారు. మండలంలోని హరిపురం నరేష్‌ ఫంక్షన్‌ హాల్‌లో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దుర్గారావు, సంతోష్‌ పండ, కొత్త గోపాల్‌, పలాస నియోజకవర్గ బిజెపి కన్వీనర్‌ రామానంద్‌ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలవలస వైకుంఠరావు, మందుస మండల పార్టీ అధ్యక్షులు దుదిష్టి పాత్రో, కోరాయి బాలకృష్ణ, విఠల్‌రావు పాల్గొన్నారు.

టిడిపిలో పలువురు చేరిక

పలాస: పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం మందస మండలం చాపరాయి, రామరాయి, గెడ్డవీధి, కొండలోగాంకు చెందిన 50 కుటుంబాల వైసిపి నాయకులు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి గౌతు శిరీష సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మందస మండల పార్టీ అధ్యక్షుడు భావన దుర్యోధన, రట్టి లింగరాజు, తమిరి భాస్కరరావు, లబ్బ రుద్రయ్య, దేబాసిస్‌ పండా, హరికృష్ణ, లఖియా పాల్గొన్నారు.ఆమదాలవలస: పట్టణంలోని వస్త్ర వ్యాపారులు పలువురు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ను కలసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు రవికుమార్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. వర్తక సంఘం నాయకులు జామి గోపి, సానా కిషోర్‌, బగాది భాస్కరరావు ఆధ్వర్యంలో పలువురు వస్త్ర వర్తకులకు కూన రవికుమార్‌ టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

 

➡️